Jani Master : రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్‌ను విచారిస్తున్న పోలీసులు

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-20 05:01:27.0  )
Jani Master : రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్‌ను విచారిస్తున్న పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌(Johnny Master)ను నార్సింగి పోలీసులు(Narsinghi Police) గోవా(Goa) నుంచి శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఒక రహస్య ప్రదేశంలో ఆయన్ను విచారిస్తున్నారు. విచారణ అనంతరం జానీ మాస్టర్‌ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా, తనపై లైంగిక ఆరోపణలు మొదలైన నాటి నుంచి తప్పించుకొని తిరుగుతున్న జానీ మాస్టర్‌ గురువారం గోవాలో చిక్కాడు. తెలంగాణ పోలీసులు గోవాలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం అక్కడి స్థానిక కోర్టులో హాజరు పర్చిన పోలీసులు.. పీటీ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకొచ్చారు. మరోవైపు రాజకీయకుట్రలో భాగంగానే తన భర్తను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని జానీ మాస్టర్ భార్య ఆయేషా ఆవేదన చెందారు. ఒకవేళ తన భర్త తప్పు చేసినట్లు నిరూపిస్తే తాను ఆయనను వదిలేస్తానని ఆమె కీలక ప్రకటన చేశారు. తన భర్త ప్రతిభను ప్రోత్సహించేవారే తప్ప ఎవరికీ నష్టం చేసేవాడు కాదన్నారు. ఒక అమ్మాయికి అవకాశం లేకుండా ఆయన ఎందుకు చేస్తారన్నారని ప్రశ్నించారు.

Advertisement

Next Story