- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసుల అదుపులో జానీ మాస్టర్
దిశ, గండిపేట్ : మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు గురి చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీబాషాను గురువారం సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితుడిని గోవాలో పట్టుకుని అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పొందిన పోలీసులు నిందితుడిని హైదరాబాద్ తీసుకొచ్చి రెగ్యులర్ కోర్టులో హాజరు పరచనున్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళా కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో అవుట్ డోర్‌లో షూటింగ్ చేస్తున్న సమయంలో, నార్సింగిలోని ఆయన ఇంట్లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు దాడులు చేశాడని ఓ మహిళా డ్యాన్సర్ ఇటీవల రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగి పోలీసు స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. అందులో భాగంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాధితురాలి వద్ద నుంచి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం నేరం జరిగినప్పుడు ఆమె మైనర్ అని వెల్లడి కావడంతో నిందితునిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నిందితుడు నెల్లూరు, నార్త్ ఇండియా స్టేట్స్‌కు వెళ్లాడని, హైదరాబాద్ నగరంలోనే మిత్రుడి ఇంట్లో తలదాచుకుంటున్నట్లుగా పలు కథనాలు మీడియాలో వచ్చాయి. నిందితున్ని పట్టుకునేందుకు మొత్తం నాలుగు బృందాలు రంగంలోకి దిగి సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు జానీ మాస్టర్‌ను గోవాలో అదుపులోకి తీసుకున్నారు. అయితే గతంలోనూ ఇలాంటి ఆరోపణలతోనే ఆయన ఆరు నెలల పాటు జైలు జీవితం కూడా గడిపినట్లుగా తెలుస్తోంది.
పోలీసులతో జానీ మాస్టర్ భార్య వాగ్వాదం
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు నమోదై విచారణ ప్రారంభమైన నేపథ్యంలో జానీ మాస్టర్ భార్య అయేషా నార్సింగి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. జానీ మాస్టర్ కు వచ్చిన ఫేక్ కాల్ పై సమాచారం తెలుసుకోవడానికి అయేషా వచ్చారు. దీంతో పోలీసులకు, ఆయేషాకు నడుమ వాగ్వాదం చోటుచేసుకుంది. జానీ మాస్టర్ కేసుకు సంబంధించి వివరాలు అడగడానికి ప్రయత్నించిన మీడియా ప్రతినిధులతోనూ అయేషా వాగ్వాదానికి దిగారు. తనకే కెమెరా పెడతారా మీపై కేసులు పెడతానంటూ మీడియాను బెదిరించింది. చివరకు ఆమెను సైతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Read More..
అలాగైతే నా భర్తను వదిలేయడానికి సిద్ధం.. జానీ మాస్టర్ భార్య సంచలన ప్రకటన
- Tags
- Johnny Master