- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విద్యుత్ షార్ట్‌సర్కూట్‌తో ఇళ్లు దగ్దం..మంటల్లో మహిళ సజీవ దహనం
దిశ, నాగారం:విద్యుత్‌షార్ట్ సర్కూట్‌తో ఇళ్లు దగ్దమై మహిళ సజీవ దహనమైన సంఘటన ఈటూరులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని ఈటూరు గ్రామానికి చెందిన మహంకాళి వెంకటమ్మ (56) తన భర్త రాములుతో కలిసి రేకుల ఇంట్లో నివాసం ఉంటుంది. కాగా బుధవారం రాత్రి ఇంట్లో విద్యుత్ సరఫరా జరిగే బోర్డులో షార్ట్ సర్కూట్ జరిగి మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో భర్త రాములు కూరగాయలు తేవడానికి వెళ్లగా, వెంకటమ్మ ఇంట్లో నిద్రిస్తుంది. మంటలు ఉధృతి ఎక్కువై బట్టలు, సామాగ్రి కాలుకుంటూ వచ్చి వెంకటమ్మకు మంటలు అంటుకోవడంతో ఆమె మంచంలోనే సజీవ దహనమైంది.
కాగా వెంకటమ్మకు మోకాళ్ల నొప్పుల కారణంగా నడవలేని స్థితిలో ఉండటంతో మంటలు వ్యాపించినప్పుడు ఆమె మంచంలో నుంచి లేవలేక పోయింది. అనంతరం, చుట్టు పక్కల వారు ఇంట్లో నుంచి పొగలు వస్తున్నాయనే విషయాన్ని గమనించి, కేకలు వేయడంతో స్థానికులు వచ్చి నీళ్లు చల్లి మంటలను ఆర్పారు. అప్పటికే వెంటకమ్మ సజీవ దహనమై మృతి చెందింది. కాగా మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పంచానామ నిర్వహించారు.