అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

by Kalyani |   ( Updated:2024-09-21 10:47:00.0  )
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
X

దిశ, నర్సాపూర్ : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నర్సాపూర్ మండల పరిధిలోని తుజాల్ పూర్ అర్జున్ తండాలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… అర్జున్ తండా కు చెందిన అలావత్ శ్రీనివాస్ (40) తన తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో నయం చేయడానికి సుమారు నాలుగు లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక గత కొన్ని రోజులుగా సతమతమవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. శుక్రవారం రాత్రి తీవ్ర మనోవేదనకు గురై తండా సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మి తో పాటు కొడుకు ప్రవీణ్ (18) కూతురు అఖిల ఉన్నారు. శ్రీనివాస్ మృతితో అర్జున్ తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story