- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: అత్యంత ప్రమాదకర రసాయనాలతో కల్తీ పాల తయారీ.. పోలీసుల అదుపులో నిందితుడు
దిశ, వెబ్‌డెస్క్: అత్యంత ప్రమాదకర రసాయనాలతో కల్తీ పాలు తయారు చేస్తున్న ఓ వ్యక్తిని రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల పరిధిలోని ముక్తాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి కొన్నాళ్ల నుంచి ప్రమాదకరమైన రసాయనాలతో కల్తీ పాలు తయారు చేసి పలు చోట్ల విక్రయిస్తూ.. జనాన్ని బురడీ కొట్టిస్తున్నాడు. ఈ క్రమంలోనే విశ్వసనీయ సమాచారం మేరకు నిఘా పెట్టిన రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు మంగళవారం ఉదయం ప్రశాంత్ కల్తీ పాలు తయారు చేస్తుండగా ఆకస్మికంగా దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు అతడి నుంచి 60 లీటర్ల కల్తీ పాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణం, ధోల్పూర్ స్మిక్డ్ మిల్క్ పౌడర్ 8 ప్యాకెట్లను ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
BREAKING: ప్రమాదకర రసాయనాలతో కల్తీ పాల తయారీ.. పోలీసుల అదుపులో నిందితుడు pic.twitter.com/tAbsIN4s5a
— $h!v@ (@Shivakumar50) May 28, 2024