BREAKING: కృష్ణా జిల్లా పెనమలూరులో బ్యాంక్ మేనేజర్ ఘరానా మోసం.. పోలీసులకు ఫిర్యాదు

by Shiva |   ( Updated:2024-02-02 11:42:36.0  )
BREAKING: కృష్ణా జిల్లా పెనమలూరులో బ్యాంక్ మేనేజర్ ఘరానా మోసం.. పోలీసులకు ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: రాత్రింబవళ్లు కష్టపడి, చమటోడ్చి సంపాదించిన సొమ్మును దాచుకోవాలంటే మనం బ్యాంకులను ఆశ్రయిస్తాం. కానీ, బ్యాంక్‌లో పనిచేస్తున్న సిబ్బందే మన సొమ్మును దోచేస్తే.. ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో సామన్య ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఇవాళ కృష్ణా జిల్లా పెనమలూరులో ఓ బ్యాంక్ మేనేజర్ చేసిన పనికి సామన్య ప్రజలు నోళ్లు వెల్లబెడుతున్నారు. గంగూరు యూనియన్ బ్యాంక్ మేజేజర్ అయిన ప్రభావతి కస్టమర్లు బ్యాంకులో తాకట్లు పెట్టిన బంగాారాన్ని ఫోర్జరీ సంతాలకాతో బయటకు తీసి విచ్చలవిడిగా జల్సాలు చేస్తోంది. తాను ధరించేందుకు ఏకంగా ఓ వడ్డాణం కూడా చేయించుకుంది. దీంతో తన బంగారం తిరిగి ఇవ్వామని అడిగిన కస్టమర్‌ యోగేశ్వర్ రావు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించింది. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తడి తెచ్చింది. దీంతో విసిగి వేసారిపోయిన బాధితుడు యోగేశ్వర్ రావు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed