BREAKING: సంగారెడ్డి జిల్లా జోగిపేటలో దారుణం.. బాలుడిని చంపి ఆత్మహత్య చేసుకున్న దొంగ

by Shiva |   ( Updated:2024-04-21 12:30:33.0  )
BREAKING: సంగారెడ్డి జిల్లా జోగిపేటలో దారుణం.. బాలుడిని చంపి ఆత్మహత్య చేసుకున్న దొంగ
X

దిశ, వెబ్‌‌డెస్క్: 13 ఏళ్ల బాలుడిని చంపి ఓ దొంగ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల పరిధిలోని జోగిపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జోగిపేటకు చెందిన నాగరాజు అనే వ్యక్తి నిన్న ఓ దుకాణంలో వైర్లను దొంగిలించాడు. అయితే, చోరీ చేస్తుండగా.. శేఖర్ అనే బాలుడు ప్రత్యక్షంగా చూశాడు. ఈ క్రమంలోనే విషయం బయటకు చెప్పాడంటూ దొంగ నాగరాజు, శేఖర్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈ మేరకు మాట్లాడాలంటూ శేఖర్‌ను, నాగరాజు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని బావిలో పడేశాడు. అదేవిధంగా వైర్లను దొంగిలించిన రోజే అదే రాత్రి అడిగితే డబ్బులు ఇవ్వలేదంటూ ఓ వ్యాపారిని నిందితుడు నాగరాజు కత్తితో బెదిరించాడు.

ఈ నేపథ్యంలో ఉదయం బావిలో శేఖర్ (13) మృతదేహం లభ్యమైంది. ఈ రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న నాగరాజును అదుపులోకి తీసుకునేందుకు అతడు ఉన్న ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. వారు రావడాన్ని గమనించిన నాగరాజు దగ్గరలో ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. అదేవిధంగా అడ్డుకోవడానికి వెళ్లిన మరో వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. సెల్ టవర్ నుంచి నాగరాజును కిందకు తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగానే.. టవర్‌పైనే వైర్లను మెడకు చుట్టుకుని నిందితుడు నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More..

కొడుకు పరీక్ష కోసం లీవ్ అడిగితే ఇవ్వలేదని.. ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

Advertisement

Next Story