Boat Accident: కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం.. గోదావరిలో పడవ బోల్తా, ఆరుగురు గల్లంతు!

by Shiva |   ( Updated:2024-07-28 11:05:06.0  )
Boat Accident: కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం.. గోదావరిలో పడవ బోల్తా, ఆరుగురు గల్లంతు!
X

దిశ, వెబ్‌డెస్క్: గోదావరిలో పడవ బోల్తాపడి ఆరుగురు గల్లంతైన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పి.గన్నవరం మండలం గంటి పెదపూడి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గోదావరి అవతలి ఒడ్డున ఉన్న ప్రజలకు పంచాయతీ సిబ్బంది పడవలో మంచినీళ్ల బాటిళ్లను తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే పడవ గంటి పెదపూడి నది పాయ వద్దుకు రాగానే ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పడవలో ఉన్న ఆరుగురు వ్యక్తులు గోదావరిలో కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు వాళ్ల ఆర్తనాదాలు విని మరో పడవలో 3 కి.మీ మేర ఛేజింగ్ చేసి ఐదుగురుని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అందులో గిడ్డి ఈశ్వర్ (27), నేలపూడి సత్యనారాయణ (45) గిడ్డి సత్యనారాయణ (45), నేలపూడి యోహాను (20), మద్ద మురళి (23) ఉన్నారు. అయితే, పడవలో ఉన్న మరో వ్యక్తి చదలవాడ విజయ్ (25) లైఫ్ జాకెట్ చిరిగిపోవడం వల్ల అతడు గల్లంతైనట్లుగా స్థానికులు తెలిపారు. కాగా, ప్రస్తుతం విజయ్ కోసం సహాయక సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Advertisement

Next Story