- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
బస్ కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
దిశ, జూబ్లిహిల్స్ : తెల్లవారు జామున అప్పుడే ఆగి ఉన్న బస్ కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మధురానగర్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.... ఆంధ్రప్రదేశ్ , ఆత్రేయపురం నుండి గురువారం రాత్రి బయల్దేరిన సాయి ఆర్. కే ట్రావెల్స్ బస్ శుక్రవారం తెల్లవారుజామున ఎస్ ఆర్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోకి వచ్చి
ప్యాసింజర్ లను దింపే క్రమంలో ఎస్ ఆర్ నగర్ లో గుర్తుతెలియని భిక్షాటన చేస్తున్న వ్యక్తి ఆత్మహత్య నేపథ్యంలో ఆగి ఉన్న బస్ చక్రాల కింద పడుకోవటం తో ఒక్కసారిగా బస్ అతని పై నుండి వెళ్లింది. నడుము భాగంలో వెనుక చక్రాలు ఎక్కటంతో వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న మధురానగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, బస్ డ్రైవర్ పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.