- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతన్ని రెండు రోజులు పడుకోబెట్టి.. అంతా నాకేసింది..! 48 గంటల తర్వాత అసలు కథ తెలిసి..!!
దిశ, వెబ్‌డెస్క్: మొబైల్స్ ఎంట్రీ ఇచ్చాక మోసాల సంఖ్య పెరిగింది. హస్కీ వాయిస్‌తో మత్తెక్కిస్తూ మాయలో పడేసి అందినకాడికి దోచుకుంటున్నారు. అమ్మాయిల మోజులో పడి సర్వం కోల్పోయి లబోదిబోమంటున్నారు యువకులు. తాజాగా ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిన యువతి ఓ వ్యక్తిని నిలువు దోపిడీ చేసింది. ఈ ఘటన హర్యానాలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఢిల్లీకి చెందిన సాక్షి అలియాస్ పాయల్ గురుగ్రామ్‌లో తన అత్తతో కలిసి ఉంటుంది. ఆమెకు గురుగ్రామ్‌కు చెందిన రోహిత్ గుప్తా బంబుల్ డేటింగ్ యాప్‌లో పరిచయం అయింది. ఇద్దరి మధ్య క్లోజ్ నెస్ పెరిగింది. దీంతో వారం రోజుల క్రితం పాయల్ ఫోన్ చేసి ఇద్దరం కలుద్దాం అంటూ రోహిత్ పై ఒత్తిడి తెచ్చింది. కాదనలేకపోయిన ఆయన తన ఇంటికి ఆహ్వానించాడు. అయితే పాయల్ మద్యం తాగుదాం అనే సరికి బయటకు వెళ్లి తీసుకొచ్చాడు. ఇద్దరూ మద్యం సేవిస్తుండగా ఐస్ క్యూబ్స్ కావాలని పాయల్ కోరడంతో వంట గదిలోకి వెళ్లిన రోహిత్ మద్యం గ్లాసులో మత్తు మందు కలిపింది. ఇది తెలియని రోహిత్ మద్యం తాగడంతో నిమిషాల్లోకి స్పృహ తప్పి పడిపోయాడు.
ఇదే అదునుగా భావించిన పాయల్.. రోహిత్ గుప్తాపై ఉన్న బంగారు ఆభరణాలతోపాటు, రూ.10 వేల నగదు, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఐఫోన్ తీసుకోని చెక్కేసింది. అతడి అకౌంట్ల నుంచి రూ.1.78 లక్షలను డ్రా చేసుకుంది. మత్తు మందు కారణంగా 48 గంటల తర్వాత నిద్ర లేచిన రోహిత్ జరిగిన మోసాన్ని గుర్తించాడు. వెంటనే వెళ్లి గురుగ్రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు జరిగినట్టు మరెవ్వరికీ జరగకూడదని, వెంటనే పాయల్‌ను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు. ప్రస్తుతం సాక్షి అలియాస్ పాయల్ కోసం పోలీసులు ఢిల్లీ, గురుగ్రామ్‌ను జల్లెడపడుతున్నారు.