- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Electric Shock : మూత్ర విసర్జన చేస్తూ విద్యుదాఘాతానికి గురైన యువకుడు మృతి...
దిశ, వైరా : మూత్ర విసర్జన చేస్తున్న యువకుడు విద్యుత్ షాక్ కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిన సంఘటన వైరా మండలంలోని మండలంలోని విప్పలమడక గ్రామంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే బూరుగు సురేష్ (29) బీ ఫార్మసీ చదివి ఐటీలో శిక్షణ పొంది హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతని సమీప బంధువు ఒకరు మృతి చెందగా స్వగ్రామానికి వచ్చిన సురేష్ గత ఆదివారం మోటార్ సైకిల్ పై హైదరాబాద్ తిరుగుపయనం అయ్యాడు. తాను రూమ్ కి వెళ్లినట్లు తండ్రి బాలకోటికి ఫోన్ చేసి సురేష్ చెప్పాడు. అదే రోజు ఫ్రెండ్షిప్ డే కావడంతో అతని స్నేహితుడు ఫోన్ చేయగా రూం నుండి బయటకు వెళ్లిన సురేష్ యూసఫ్ గూడలో రాత్రి వేళ రోడ్డు పక్కన మోటారు సైకిల్ ను ఆపి మూత్ర విసర్జన చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడి అక్కడే పడిపోయాడు.
సురేష్ మూత్ర విసర్జన చేసిన ప్రదేశంలో 11 కేవి అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ ఉండటంతో అతనికి విద్యుత్ షాక్ తగిలిన వెంటనే లైన్ ట్రిప్ అయినది. సబ్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది 5 నిమిషాల తర్వాత మరల లైన్ ఆన్ చేశారు. అక్కడే పడిపోయి ఉన్న సురేష్ కు మరోసారి విద్యుత్ షాక్ తగిలి మరల విద్యుత్ లైన్ ట్రిప్ కావటంతో లైన్ చెకింగ్ కు వచ్చిన విద్యుత్ శాఖ ఉద్యోగులు గాయపడిన సురేష్ ను గమనించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు సార్లు విద్యుత్ షాక్ కు గురైన సురేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని మృతదేహాన్ని శనివారం రాత్రి స్వగ్రామం విప్పలమడక తీసుకురాగా తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతం అయ్యారు.