- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యూపీలో పన్నెండేళ్ల బాలిక పై.. మదర్సా టీచర్ లైంగిక దాడి.!
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మదర్సా టీచర్ 12 ఏళ్ల బాలికను బందీగా చేసుకొని లైంగిక దాడికి పాల్పడ్డాడు. మంగళవారం ఘటనకు పాల్పడ్డ కీచక టీచర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మౌల్వీ రహ్మత్ అలీ, గోరఖ్ పూర్ లోని ఉరువా పోలీస్ స్టేషన్ లో పరిధిలోని గ్రామంలో గల మదర్సా లో బోధిస్తున్నాడు. ఎప్పటిలాగే 12 ఏళ్ల బాలిక చదువుకునేందుకు మదర్సా కు రాగా తరగతులు ప్రారంభమైన సుమారు 2.30 గంటల తర్వాత.. రహ్మత్ అలీ ఇతర పిల్లల్ని ఇంటికి పంపి, బాధిత బాలికను మాత్రం మాటల్లో పెట్టి అక్కడే మదర్సా లో ఉంచుకున్నాడు. తర్వాత బాలికను అరిస్తే చంపేస్తానని బెదిరించి, అక్కడే మదర్సాలో లైంగిక దాడికి పాల్పడ్డాడు.
తదనంతరం, ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని మొత్తం తల్లికి చెప్పగా.. బాలిక తల్లి పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. తర్వాత బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు సౌత్ సూపరింటెండెంట్ పోలీస్ జితేంద్ర కుమార్ వెల్లడించారు. అహ్మద్ అలీ పై పోక్సో చట్టం తో పాటు ఇతర చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.