Accident:ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు

by Jakkula Mamatha |   ( Updated:2024-08-13 14:57:42.0  )
Accident:ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు
X

దిశ, ఏలూరు:ఏలూరు జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడే మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం ఏలూరు నుంచి గుండుగొలను వైపు వెళ్తున్న లారీ మంగళవారం సాయంత్రం భోజనం నిమిత్తం నిలుపుదల చేశారు. అదే సమయంలో ఏలూరు వైపు నుంచి వస్తున్న కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. కారు సగ భాగం లారీ కిందకు వెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి పోలీసులు అతన్ని అంబులెన్స్ లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దెందులూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed