వదినతో అక్రమ సంబంధం.. అడ్డువచ్చిన అన్న హతం

by Aamani |   ( Updated:2024-11-11 06:14:49.0  )
వదినతో అక్రమ సంబంధం.. అడ్డువచ్చిన అన్న హతం
X

దిశ, నాగర్ కర్నూల్ : తోడబుట్టిన అన్న భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా.. అడ్డుగా ఉన్న తన అన్నను హతమార్చాడు ఓ తమ్ముడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం రాళ్లచెరువు తండాలో శనివారం రాత్రి చోటు చేసుకోగా సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూల్ సీఐ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం ... రాళ్లచెరువు తండాకు చెందిన శీను(40), గోపాల్ సొంత అన్నదమ్ములు. ఈ క్రమంలో గోపాల్ తన అన్న భార్య అయిన శాంతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తన అన్న శ్రీను కు తెలిసి వారిద్దరిని మందలించాడు.

దీంతో తమకు అడ్డుగా ఉన్న శ్రీనును ఎలాగైనా హత్య చేయాలని పథకం వేశారు. శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న శ్రీను తలపై కర్రతో బాది హతమార్చాడు. అనంతరం అదే తండా లో ఉన్న తన అత్తగారి ఇంటి ముందు మృతదేహాన్ని పడేసి వెళ్తుండటం గ్రామస్తులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిమ్మాజీపేట పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని జడ్చర్ల ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.గోపాల్, అతని వదిన శాంతి , తల్లి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed