- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్తపై భార్య హత్యాయత్నం
వివాహేతర బంధానికి అడ్డొస్తున్నడని ఘాతుకం
దిశ, నిజామాబాద్ క్రైం : నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 8న తెల్లవారు జామున సోనీ ఫంక్షన్ హల్ సమీపంలో ఓ వ్యక్తిపై జరిగిన హత్యయత్నం కేసును పోలీసులు 24 గంటల్లో చాకచక్యంగా ఛేదించారు. మంగళవారం నిజామాబాద్ ఏసీపీ ఎం.కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని దారుగల్లికి చెందిన సయ్యద్ షపిఉల్లా హుస్సేన్ అనే వ్యక్తికి ముస్తాయిద్ పురకు చెందిన సయ్యద్ షహిన్ తో వివాహేతర సంబంధం ఉంది.
ఇదే విషయమై షహిన్ తో తన భర్త తరచూ గొడవలు జరుగుతూనే ఉండేవి. ఈ క్రమంలో తమ వివాహేతరం బంధానికి భర్త అడ్డుగా ఉన్నడని భావించిన షహిన్ ఈ నెల 8న షఫీఉల్లా హుస్సేన్, షహీన్ భర్త సయ్యద్ షకీల్ ను మాట్లాడుకుందామని పిలిచాడు. ఎల్లమ్మగుట్టలోని సోనీ ఫంక్షన్ హాల్ ప్రాంతానికి తీసుకెళ్లారు. సయ్యాద్ షకీల్ తో పథకం ప్రకారం సయ్యద్ షఫిఉల్లా హస్సేన్ అతనితో గొడవకు దిగాడు. అనంతరం అక్కడే ఉన్న బండ రాయితో సయ్యద్ షకీల్ ను గాయపరిచాడు. ఖాళీ బీరు సీసాను పగులగొట్టి షకీల్ ను పొడిచేందుకు యత్నించాడు.
అక్కడే ఉన్న షోయబ్ అడ్డుకోవడంతో అతడిని చంపుతానని బెదిరించడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో షకీల్ కు తీవ్ర గాయాలయ్యాయి. షకీల్ కొడుకు షోయబ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నగర సీఐ వెంకట నారాయణ ఆధ్వర్యంలో నాలుగో టౌన్ ఎస్సై సందీప్ తో కలిసి సీసీ టీవీ పుటేజీ ఆధారంగా నిందితుడు షఫీ ఉల్లా హుస్సేన్ ను సాయంత్రం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ ఎం.కిరణ్ కుమార్ తెలిపారు.