రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్తకు గాయాలు

by Sumithra |
రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్తకు గాయాలు
X

దిశ, కామారెడ్డి రూరల్ : సొంత పనులపై ఇంటి నుంచి మోటార్ సైకిల్ పై బయలుదేరిన భార్యాభర్తలను రెడీమిక్స్ వాహనం ఢీ కొనడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. దేవునిపల్లి ఎస్సై ప్రసాద్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజంపేట గ్రామానికి చెందిన కుమ్మరి వెంకటి, ఆయన భార్య కుమ్మరి వినోద (45) మోటార్ సైకిల్ పై బుధవారం చిన్న మల్లారెడ్డి వైపు వెళ్తున్నారు.

కాగా కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి చెరువు సమీపంలో ఎదురుగా వస్తున్న రెడీమిక్స్ వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో వినోద అక్కడికక్కడే మృతి చెందగా ఆమె భర్త వెంకటికి తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ లో మృతురాలిని, క్షతగాత్రున్ని కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Next Story