నా భర్త నన్ను అక్కడ కొరికాడు.. కేసు పెట్టిన భార్య

by sudharani |   ( Updated:2022-08-10 06:40:49.0  )
నా భర్త నన్ను అక్కడ కొరికాడు.. కేసు పెట్టిన భార్య
X

దిశ, వెబ్‌డెస్క్: భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. ఒకరి మీద మరొకరికి ఉన్న అపార్థాల వల్లనో.. లేక పద్దతులు నచ్చకపోవడం వల్లనో గొడవలు జరుగుతుంటాయి. కొన్ని సార్లు చిన్న చిన్న గొడవలకే పోలీస్ స్టేషన్ వరకు వెళుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తన భర్త కొరికాడంటూ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసింది భార్య.

వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరులోని కేసీపీ కాలనీకి చెందిన తాళ్లపూడి రాంబాబు, స్రవంతి భార్యాభర్తలు. రాంబాబు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్య ఇంటిలోనే ఉంటుంది. భర్త మద్యానికి బానిసై.. రోజూ తాగి వచ్చి భార్యను హించించేవాడు. అదేవిధంగా తాజాగా మద్యం తాగి వచ్చి భర్యతో గొడవకు దిగాడు. అప్పటికే భర్తపై విసిగిపోయిన భార్య గట్టిగా భర్తను మందలించింది. దీంతో కోపంతో రగిలిపోయినా రాంబాబు.. భార్యను కొట్టాడు. అంతేగాక గట్టిగా బుగ్గ కొరికేశాడు. వెంటనే తప్పించుకుని ఆసుపత్రికి వెళ్లి.. వైద్యం అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


కూతురుకు మద్యం తాగించిన టాలీవుడ్ నటి.. నువ్వు అమ్మవేనా అంటూ సెటైర్స్

ఫ్యాన్స్‌కు నాగచైతన్య సూచన.. షాక్‌లో సమంత

Advertisement

Next Story

Most Viewed