- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిషేధిత సిగరెట్లు అమ్ముతున్న ఇద్దరి అరెస్ట్
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: నిషేధిత సిగరెట్లను అమ్మతున్న ఇద్దరిని పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఎనిమిది లక్షల రూపాయల విలువ చేసే సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఫీల్‌ఖానా షిఖా ఎన్క్లేవ్నివాసి విపుల్రంకా (38), మంగళ్హాట్నివాసి, ప్రగతి ట్రాన్స్‌పోర్టులో మేనేజర్‌గా పని చేస్తున్న దీపక్జాదవ్(28)తో కలిసి సీతారాంబాగ్ కేంద్రంగా నిషేధిత సిగరెట్ల దందా చేస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందటంతో టాస్క్‌ఫోర్స్‌పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశారు.
మొదట్లో బేగంబజార్ అజీజ్ ప్లాజాలో కన్ఫెక్షనరీ వ్యాపారం ప్రారంభించిన విపుల్రంకా ఆ తరువాత తేలికగా డబ్బు సంపాదించే లక్ష్యంతో ఢిల్లీ నుంచి నిషేధిత సిగరెట్లను తెప్పించుకుంటూ అమ్మటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో పోలీసులకు గతంలో పట్టుబడ్డాడు కూడా. అయినా ప్రవృత్తిని మార్చుకోకుండా అదే వ్యాపారం చేస్తూ తాజాగా మరోసారి అరెస్టయ్యాడు. నిందితులను అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహ్మద్ ఖలీల్ పాషా, ఎస్సైలు షేక్ కవియుద్దీన్ తదితరులను డీసీపీ రాధాకిషన్‌రావు అభినందించారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం అరెస్టు చేసిన ఇద్దరిని మంగళ్‌హాట్ పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు.