- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేజీఎఫ్ రాఖీభాయ్ అవ్వాలని చిన్ననాటి స్నేహితుడినే..
దిశ, వెబ్ డెస్క్: ఏదైనా సంచలనం చేసి భాయ్ అవ్వాలని ఓ యువకుడు తన చిన్ననాటి స్నేహితుడినే పొట్టన పెట్టుకున్నాడు. జనవరి 22న జియాగూడలో నడిరోడ్డుపై జరిగి మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. సాయినాథ్ అనే వ్యక్తి హత్యకు గురికాగా నిందితులైన ఆకాష్, సోనూ, సాయికుమార్ లను పోలీసులు రిమాండ్ కు తరలించారు. గోషామహల్ ఏసీపీ సతీష్ కుమార్, కుల్సుంపురా ఇన్స్ పెక్టర్ అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు సాయినాథ్ అంబర్ పేటలో గ్లాస్ కటింగ్ వ్యాపారం చేస్తున్నాడు.
జియాగూడకు చెందిన ఆకాష్ సాయినాథ్ చిన్ననాటి స్నేహితులు పదో తరగతి వరకు అంబర్ పేటలో కలిసి చదువుకున్నారు. ఆకాష్ ఆ తర్వాత జియాగూడకు మకాం మార్చాడు. అయితే తరచూ స్నేహితులంతా పార్టీలు చేసుకునేవారు. ఆకాష్ కు భాయ్ కావాలని బలమైన కోరిక ఉండేది. ఇటీవల కేజీఎఫ్ సినిమా చూశాక ఆ కోరిక మరింత బలపడింది. అయితే సాయినాథ్ కు ఆకాష్ ఇచ్చిన రూ.లక్ష వడ్డీ విషయంలో గత కొన్ని రోజులుగా గొడవ నడుస్తోంది.
వడ్డీ డబ్బులు అడిగినప్పుడల్లా సాయినాథ్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడు. ఈ నేపథ్యంలో సాయినాథ్‌పై పగ పెంచుకున్న ఆకాష్ చంపాలని ప్లాన్ వేశాడు. ఇందుకు తన స్నేహితులు సోనూ, సాయికుమార్ ల తో పథకం వేశాడు. జనవరి 22న సాయినాథ్ ను జియాగూడకు మాట్లాడుకుందాం అని చెప్పి పిలిపించారు. అనంతరం ముందే వెంట తెచ్చుకున్న రెండు కొడవళ్లు, రాడ్డుతో సాయినాథ్ పై విచక్షణ రహితంగా దాడి చేసి కిరాతకంగా చంపేశారు. నిందితులను పట్టుకునేందుకు ఐదు బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు విచారణలో హత్యకు గల కారణాలను వెల్లడించారు.