ఫర్టిలైజర్ దుకాణాల్లో విజిలెన్స్ అధికారుల దాడులు..

by Kalyani |
ఫర్టిలైజర్ దుకాణాల్లో విజిలెన్స్ అధికారుల దాడులు..
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలోని పలు ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ దుకాణాలలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ఫర్టిలైజర్ దుకాణంలో 363 లీటర్ల నిషేధిత (గ్లైఫోసెట్) గడ్డి మందు, మరికొన్ని పురుగుల మందులను సీజ్ చేశారు. కోర్టు స్టే ఉన్న గడ్డి మందు భారీ స్థాయిలో నిల్వ ఉంచి రైతులకు అమ్ముతున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ. 38 లక్షల వరకు ఉంటుందని ఏడీఏ రమేష్ బాబు పేర్కొన్నారు.

దీంతో పాటు మరికొన్ని దుకాణాలలోనూ దాడులు నిర్వహించగా అక్కడ ఎలాంటి నిషేధిత పురుగుమందులు దొరకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని పలు ఫర్టిలైజర్ దుకాణ యాజమానుల నుంచి కిందిస్థాయి వ్యవసాయ అధికారులకు ప్రతినెల ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారికి సమాచారం అందించినట్లు చర్చ జరుగుతుంది. ఇప్పటికే నిషేధిత గడ్డి మందు సరఫరాపై రైతుల నుంచి పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు అందినా పట్టించుకోకపోవడం విశేషం.

Advertisement

Next Story