- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రైల్వే ప్లాట్ ఫాంపై గుర్తు తెలియని వృద్ధురాలి మృతి
by Shiva |

X
దిశ, జమ్మికుంట : జమ్మికుంట రైల్వే ప్లాట్ ఫాంపై ఓ గుర్తు తెలియని వృద్దురాలు (80) మృతి చెందినట్లు రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. మృతురాలు అనారోగ్యం లేదా ఎండ తీవ్రతకు చనిపోయి ఉండవచ్చని తెలిపారు. మృతురాలి ఒంటిపై వంకాయ రంగు డిజైన్ బ్లౌజ్, కానకాంబరం రంగు చీర ధరించి ఉందని తెలిపారు. సమీపంలో ఎలాంటి గుర్తింపు కార్డు లేవని, మృతదేహాన్ని హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో భద్రపరచామని తెలిపారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే.. వివరాల కోసం 9949304574, 944070039 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని హెడ్ కానిస్టేబుల్ తిరుపతి కోరారు.
Next Story