- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేమంటే ఇదేనేమో.. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఏం చేసిందంటే..?
దిశ, వెబ్‌డెస్క్: నేటి కాలంలో భార్య బతికుండానే భర్త, అదే విధంగా భర్త బతికుండగా భార్య అక్రమ సంబంధాలు పెట్టుకుని వివాహ జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. అలాంటి వాళ్లు ఉన్న సమాజంలో తన భర్త చావుని తట్టుకోలేక భార్య చేసిన పని అందరినీ కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన సాహితి (29), వనస్థలిపురానికి చెందిన సాప్ట్‌వేర్ ఉద్యోగి మనోజ్‌తో గతేడాది వివాహం జరిగింది. పెళ్లి అనంతరం ఇద్దరు USకి వెళ్లిపోయారు. ఇటీవల తల్లిదండ్రులను చూసేందుకు సాహితి హైదరాబాద్‌కు వచ్చింది.
ఆ సమయంలోనే USలో ఉన్న మనోజ్ గుండెపోటుతో మరణించాడు. ఈ నెల 23న US నుంచి మనోజ్ మృతదేహాన్ని తీసుకొచ్చి బుధవారం హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం సాహితి పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ భర్త మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైంది. ఆమెకు తోడుగా ఉన్న చెల్లెలు గురువారం ఉదయం బయటకు వెళ్లడంతో ఇంట్లో ఎవరు లేని సమయం చూసి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నారు. సాహితి తీసుకున్న ఈ తీవ్ర నిర్ణయానికి కుటుంబ సభ్యులు గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.