వాడు నావాడే.. కాదు నావాడే.. సుందరాంగుడి కోసం విషం తాగిన ఇద్దరు ప్రియురాళ్లు

by Bhoopathi Nagaiah |
వాడు నావాడే.. కాదు నావాడే.. సుందరాంగుడి కోసం విషం తాగిన ఇద్దరు ప్రియురాళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఒక యువకుడు, ఇద్దరు యువతుల ప్రేమ విషాదంగా మారింది. అతడు ఎవరిని ప్రేమిస్తున్నాడో కూడా క్లారిటీ లేకుండా ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంతకు ఆ యువకుడు తనను ప్రేమిస్తున్నాడా లేదా అనే విషయం తెలియకుండనే ఓ యువతి మృతి చెందగా.. మరో యువతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అనంతపురం జిల్లాకు చెందిన నాగేందర్‌ను వందన, సంజన (అమ్మాయిల ప్రైవసీ దృష్ట్యా పేర్లు మార్చడం జరిగింది) అనే ఇద్దరు యువతులు ప్రేమించారు. నాగేందర్ ఇద్దరితోనూ క్లోజ్‌గా, చనువుగా ఉండేవాడు. ఈ క్రమంలో అతడితో ఇద్దరు యువతులు ఒకరికి తెలియకుండా మరొకరు నాగేందర్‌తో ప్రేమలో పడ్డారు. అయితే ఇటీవలనే ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు యువతులు షాక్ కు గురయ్యారు. నాగేందర్‌ను ఇద్దరూ గాఢంగా ప్రేమిస్తుండటంతో అతడు లేని జీవితం వ్యర్థం అనే భావనకు వచ్చారు. ఇదే విషయాన్ని వందన, సంజన చర్చించుకున్నారు. ఇద్దరిలో ఎవరిని ప్రేమిస్తున్నాడు అనే దానిపై వందన, సంజనకు క్లారిటీ రాలేదు.

అయితే నాగేందర్ లేని జీవితాన్ని ఊహించుకోని ఇద్దరు యువతులు అనంతపురం ఆర్డీవో ఆఫీసు సమీపంలో గుర్తు తెలియని కెమికల్‌ను తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పాయిజన్ తాగిన తర్వాత నాగేందర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. నువ్వు లేకుండా మేము బతకలేం అంటూ చెప్పారు. షాక్‌కు గురైన నాగేందర్ వెంటనే తేరుకోని ఆర్డీఓ ఆఫీసు వద్దకు చేరుకుని యువతులిద్దరిని ఆస్పత్రికి చేర్పించాడు. అక్కడ చికిత్స పొందుతూ వందన మృతి చెందగా, సంజన పరిస్థితి విషమంగా మారింది. మరోవైపు నాగేందర్‌పై యువతుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన బిడ్డను అన్యాయంగా చంపేశాడని వందన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Next Story

Most Viewed