- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇద్దరు మావోయిస్టు సభ్యులు లొంగుబాటు

దిశ, ఏటూరునాగారం : నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఎదుట లొంగిపోయారు. కాగా ఆదివారం మండల కేంద్రంలోని ఏఎస్పీ కార్యాలయంలో లొంగిపోయిన వారి వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు.
ప్రభుత్వ సరెండర్-కమ్-రిహబిలిటేషన్ పాలసీలో భాగంగా ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ నిషేధిత సీపీఐ సీఎన్ఎం సభ్యుడు మడవి కోస(20) తో పాటు మిలిషియా సభ్యురాలైన మడకం అలియాస్ సోడి జోగి (23 అనే ఇద్దరు మావోయిస్టు పార్టీ సభ్యులు జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని భావించి ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఎదుట లొంగిపోయారు.
ఈ సందర్బంగా ఏఎస్పీ మాట్లడుతూ మావోయిస్టు క్యాడర్ అందరూ ప్రభుత్వం అందిస్తున్న సరెండర్-కమ్-రిహబిలిటేషన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్, వెంకటాపురం సీఐ బండారి కుమార్, వెంకటాపురం ఎస్సై కొప్పుల తిరుపతి రావు, పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.