గోదావరిలో ఈతకు దిగి ఇద్ధరు మృతి

by Shiva |
గోదావరిలో ఈతకు దిగి ఇద్ధరు మృతి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టు వద్ద బుధవారం గోదావరిలో ఈతకు దిగి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. మెండోరా మండలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గోదావరి నదిలో కాలక్షేపనికి ఈత కొట్టేందుకు వెళ్లిన అబ్దుల్ బార్ (16), అబ్దుల్ ఫయిమ్ (50) ఇద్దరు మృతి చెందారు. మృతులు నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజుల్ పేట్ వాసులుగా పోలీసులు గుర్తించారు. కాలక్షేపం కోసం ప్రాజెక్టును చూసేందుకు వచ్చి నీటిలో సరదాగా ఈత కోట్టేందుకు దిగి ప్రాణాలు పోగోట్టుకున్నారు. ఈ మేరకు మెండోరా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed