- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్నానానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు.. తిరిగిరాని లోకాలకు..
దిశ, వీణవంక : మండలంలోని కొండపాక గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. జమ్మికుంట మండలం తనుగుల గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు జూపాక సాత్విక్ (14), కాసర్ల కావ్య(12) వేసవి సెలవుల్లో కొండపాక గ్రామంలోని తమ పెద్దమ్మ ఇంటికి వచ్చి విగతజీవులుగా మారారు. చెక్ డ్యాం కోసం ఇసుక తవ్వగా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాటిలో నీరు నిల్వ ఉండడంతో ఇద్దరు చిన్నారులు స్నానానికి వెళ్లి నీటి గుంతలో పడి మృత్యువాత పడ్డారు. దీంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇదే గుంతలో ఇంతకుముందు వెన్నంపల్లి గ్రామానికి చెందిన యువకుడు కూడా పడి మృతి చెందాడు. అయినప్పటికీ కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంతో అమాయకుల జీవితాలు బలిగొంటున్నాడు. ఇప్పటికైనా గుంతలు పూడ్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఈటల సంతాపం..
చెక్ డ్యాం గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతికి మాజీ మంత్రి ఈటల తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఇద్దరు చిన్నారుల కుటుంబ సభ్యులకు అండగా ఉండాలని తెలిపారు.