- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు బైకులు ఢీ.. ఇద్దరి మృతి మరో ముగ్గురికి గాయాలు
దిశ, భూత్పూర్: మండల పరిధిలోని మద్దిగట్ల శివారులో ఉన్న చెవుల తాండ వద్ద కర్నూల్ రోడ్డుపై రెండు మోటార్ సైకిళ్ళు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. భూత్పూర్ మండల పరిధిలోని కప్పట గ్రామానికి చెందిన వడ్డే భాస్కర్, అతని భార్య సంధ్య, కూతురు పావని (3), ఏడు నెలల కుమారుడు రిత్విక్ తో కలిసి నాగర్ కర్నూల్ వైపు నుంచి తమ సొంత గ్రామానికి మోటార్ సైకిల్ పై వస్తున్నారు.
ఇదే క్రమంలో గెలిపించర్ల గ్రామానికి చెందిన కాసిం (35) అనే వ్యక్తి భూత్పూర్ వైపు నుంచి తమ సొంత గ్రామం ఎల్పిచర్లకు రాంగ్ రూట్ లో వెళ్లి ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ ను వేగంగా ఢీకొట్టాడు. సంఘటనలో కాసిం, చిన్నారి పావని తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించారు. భాస్కర్, సంధ్య, వారి కుమారుడు రిత్విక్ కు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. భూత్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.