రెండు బైకులు ఢీకొని ఇద్దరు మృతి

by Sridhar Babu |
రెండు బైకులు ఢీకొని ఇద్దరు మృతి
X

దిశ, మునుగోడు : మునుగోడు-చొల్లేడు రహదారిలో ప్రమాదవశాత్తు రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మునుగోడు గ్రామానికి చెందిన రేవెల్లి నాగరాజు(21) అనే వ్యక్తి చొల్లేడు గ్రామం నుండి బైక్ పై మునుగోడుకు వస్తుండగా మర్రిగూడ మండల పరిధిలోని నర్సిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన కీలికత్తుల ఆంజనేయులు(23), శివన్నగూడెంకు చెందిన బొమ్మగోని నగేష్ కలిసి మరో బైక్ పై మునుగోడు నుండి చొల్లేడు మీదుగా శివన్నగూడెంకు వెళ్తున్నారు.

మునుగోడు గ్రామ శివారులో వీరి రెండు బైకులు ఢీకొన్నాయి. దీంతో నాగరాజు, ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించి తీవ్రగాయాలైన నగేష్ ను నల్లగొండ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed