గంటల వ్యవధిలో రెండు ప్రమాదాలు...ముగ్గురు మృతి

by Sridhar Babu |
గంటల వ్యవధిలో రెండు ప్రమాదాలు...ముగ్గురు మృతి
X

దిశ, పాల్వంచ రూరల్ : గంటల వ్యవధిలోనే రెండు ప్రమాదాలు జరిగి ముగ్గురు మృతి చెందారు. ఈ రెండు వేర్వేరు ప్రమాదాలు మంగళవారం సాయంత్రం పాల్వంచ ఇందిరా కాలనీలో చోటు చేసుకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు యువకులు ఇందిరా కాలనీ వద్ద బైక్ మీద వెళుతూ డివైడర్ ని ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఇంకొకరు ఆస్పత్రిలో మృతి చెందాడు. ఈ ప్రమాదం జరిగిన గంట వ్యవధిలోనే అదే ఇందిరా కాలనీలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story