పిడుగుపాటుతో ముగ్గురు మహిళలకు అస్వస్థత

by Sridhar Babu |
పిడుగుపాటుతో ముగ్గురు మహిళలకు అస్వస్థత
X

దిశ,తిరుమలాయపాలెం : బచ్చోడు తండాలో కురిసిన అకాల వర్షానికి పిడుగుపడటంతో ముగ్గురు మహిళా కూలీలు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం తిరుమలాయపాలెం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం...మండలంలోని బచ్చోడు తండాకు చెందిన భూక్య శారద కూతురు దేవితోపాటు, ధరావత్ జీజా, మరో వ్యక్తి సరోజా మిరపతోటలో కలుపు తీస్తుండగా వర్షం రావడంతో చెట్టుకిందకు వెళ్లారు. ఈ క్రమంలో పెద్దగా ఉరిమి సమీపాన ఉన్న చెట్టుపై పిడుగు పడింది.

దీంతో ముగ్గురు మహిళలు అస్వస్థకు గురికాగా చికిత్స కోసం వారిని వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దేవి, జీజా ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ శారద పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉండడంతో వెంటిలేటర్ సహాయంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు చావా శివరామకృష్ణ బాధితులను పరామర్శించారు. ఆయన వెంట కాంగ్రెస్ యువజన నాయకుడు గుగులోత్ సురేశ్ ఉన్నారు.

Advertisement

Next Story