Road Accident:ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. ముగ్గురు మృతి

by Jakkula Mamatha |   ( Updated:2024-11-23 10:44:20.0  )
Road Accident:ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. ముగ్గురు మృతి
X

దిశ,వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఈ రోజు(శనివారం) అనంతపురం జిల్లా(Anantapur District) గార్లదిన్నె మండలం లో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మృతి చెందిన వారు పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Read More..

Rain Alert:బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండ్రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు

Advertisement

Next Story

Most Viewed