దొరికిపోతానన్న భయంతో గోల్డ్ చైన్ మింగిన దొంగ.. చివరికి ఏమైందంటే?

by Javid Pasha |
దొరికిపోతానన్న భయంతో గోల్డ్ చైన్ మింగిన దొంగ.. చివరికి ఏమైందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు కొట్టేసిన ఓ దొంగ పోలీసులు వెంటబడటంతో ఆ గొలుసును మింగేశాడు. దీంతో తీవ్ర కడుపు నొప్పి వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన జార్ఖండ్ లోని రాంచీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సల్మాన్, జఫర్ అనే ఇద్దరు చైన్ స్నాచర్లు దొరందా పోలీసు స్టేషన్ పరిధిలోని దుబాడి బ్రిడ్జి వద్ద ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కొని బైక్ పై పారిపోయారు. అయితే అక్కడే కొద్దీ దూరంలో ఉన్న పోలీసులు దొంగలను చేధించడం మొదలుపెట్టారు. అలా ఓ కిలోమీటర్ పరుగెత్తి ఆ దొంగలను పట్టుకున్నారు పోలీసులు. అయితే పోలీసులకు దొరికిపోతానన్న భయంతో సల్మాన్ కొట్టేసిన ఆ గోల్డ్ చైన్ ను అమాంతం మింగేశాడు.

అయితే ఇక గొలుసును మింగతుండగా చూసిన పోలీసులు.. ఆ దొంగను ఆసుపత్రిలో చేర్పించి ఎక్స్ రే తీయించారు. దాంట్లో ఛాతి భాగంలో చైన్ ఉండిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. ఇక చైన్ లోపల ఉండటంతో శ్వాస తీసుకోవడానికి సల్మాన్ ఇబ్బందిపడటంతో వైద్యులు అతడిని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు. గ్యాస్ట్రోస్కోపీ గానీ ఎండోస్కోపీ గానీ చేసి లోపల ఉన్న చైన్ ను బయటకు తీసేందుకు డాక్టర్లు శ్రమిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed