- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్యాగు కొట్టేసిన... దొంగలను పట్టేశారు
దిశ, అచ్చంపేట: బస్సులో ఓ ప్రయాణికుడి నుంచి డబ్బులు ఉన్న బ్యాగును కొట్టేసి పరారు కావడానికి ప్రయత్నించిన ముగ్గురు మహిళలను పోలీసులు చాకచక్యంగా పట్టుకోగా.. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాదులో సీనియర్ మెడికల్ కోడింగ్ అనాలసిస్టుగా ఉద్యోగం చేస్తున్న సోముల నారాయణ, ఆయన సతీమణి కలిసి కర్నూలు జిల్లాలోని దోర్నాల గ్రామం నుంచి శ్రీశైలం వస్తున్న బస్సులో వారి స్వగ్రామమైన సున్నిపెంటకు బయలుదేరారు. వారు స్వగ్రామం చేరుకునే సమయానికి చూసుకోగా 31 వేల రూపాయలు ఉన్న బ్యాగు కనిపించలేదు.
మరోవైపు ముగ్గురు మహిళలు, మరో పురుషుడు కలిసి ఒకింత ఆందోళనలతో సున్నిపెంట వద్ద ఒక ఆటోను కిరాయికి మాట్లాడుకొని అచ్చంపేట వెళ్లాలని డ్రైవర్ సలీంకు చెప్పడంతో.. వారిని తీసుకొని అచ్చంపేటకు బయలుదేరాడు. ఈ క్రమంలో బ్యాగు పోగొట్టుకున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సీసీ కెమెరాలు పరిశీలించారు. సీసీ కెమెరాలో బ్యాగు తీసుకొని వెళుతున్న వారి వివరాలు, ఆటో వివరాలు తేలాయి. ఆటో యూనియన్ వారు విషయాన్ని డ్రైవర్ కు తెలియజేయడంతో అతను జాగ్రత్తపడి ఆటోను అమ్రాబాద్ మండలం మన్ననూరు అంబేద్కర్ చౌరస్తా వద్ద అప్పటికే ఆటో కోసం ఎదురుచూస్తున్న పోలీసులు కనిపించడంతో డ్రైవర్ ఆటోను నిలిపాడు.
విషయాన్ని పసిగట్టిన దొంగలు బ్యాగుతో సహా పరారు కావడానికి ప్రయత్నించగా డ్రైవర్ వారి నుంచి బ్యాగులు పట్టి లాగేసుకున్నాడు. ఈ క్రమంలో పోలీసులు ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకోగా.. మరో వ్యక్తి పరారీ అయ్యాడు. అదుపులోకి తీసుకున్న మహిళలను పోలీసులు విచారించగా విజయవాడ కు చెందిన ఆకుల దేవి, ఆకుల శ్వేత, నంద్యాల పట్టణానికి చెందిన ఉషాకుమారి, పరారీ అయిన వ్యక్తి ఆకుల శ్రీనుగా పోలీసులు గుర్తించారు. పట్టుపడ్డ వారిని ఆంధ్ర ప్రాంతానికి చెందిన సున్నిపెంట పోలీసులకు అప్పగించారు.