- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైల్డ్ పోర్నోగ్రఫీపై సీఐడీ ‘ఐ’
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పెరిగిపోతున్న చైల్డ్ పోర్నోగ్రఫీ నేరాలపై రాష్ర్ట సీఐడీ సీరియస్ గా దృష్టిని సారించింది. ఈ నేరాలకు పాల్పడుతున్న వారిని పట్టుకోవటానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అమెరికాకు చెందిన ఓ ఏజన్సీతో సమన్వయం చేసుకుంటూ సీఐడీ అధికారులు చైల్డ్ పోర్నోగ్రఫీ నేరాలు చేస్తున్న వారిని ట్రాక్ చేస్తున్నారు. గడిచిన ఆరు నెలల్లో 8 కేసుల్లో ఛార్జీషీట్లను దాఖలు చేశారు. మరో 36 కేసుల్లో విచారణను ముమ్మరం చేశారు. చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు చూడటానికి అలవాటుపడిన కొందరు ఆ వీడియోలను సోషల్‌మీడియాలోని వేర్వేరు ప్లాట్‌ఫాంలలో వైరల్చేస్తున్నారు. వీటిని చూస్తున్న వారిలో కొందరు తప్పుడు తోవల్లోకి వెళుతుండటంతోపాటు నేరాలకు సైతం పాల్పడుతున్నారు. సీఐడీకి చెందిన ఓ సీనియర్అధికారి చెప్పిన ప్రకారం ఈ తరహా వీడియోలను ఎక్కువగా సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలోకి అప్లోడ్ చేస్తున్నారు.
జేబులో ఉండే స్మార్ట్ ఫోన్లతో పాటు ల్యాప్ ట్యాప్లు, కంప్యూటర్లను ఉపయోగిస్తూ వేర్వేరు పోర్న్ సైట్లను సందర్శిస్తున్న వీళ్లు అయిదు నుంచి పదకొండు నిమిషాలపాటు నిడివి ఉన్న చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్లోడ్ చేస్తున్నారు. అనంతరం వాటిని వాట్సాప్, టెలీగ్రామ్, ఇన్స్ గ్రామ్ తదితర గ్రూపుల్లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ వీడియోలను చూస్తున్న వారిలో కొందరు అనుభవం కోసం వెంపర్లాడుతూ నేరాలకు సైతం పాల్పడుతున్నారు. వీరిలో మైనర్లు కూడా ఉండటం గమనార్హం. దీనికి నిదర్శనంగా కొన్నిరోజుల క్రితం హయత్ నగర్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటనను పేర్కొనవచ్చు. ఓ స్కూల్లో చదువుకుంటున్న నలుగురు విద్యార్థులు నీలిచిత్రాలు చూడటానికి మరిగి తమ తరగతిలోనే చదువుకుంటున్న ఓ మానసిక వికలాంగురాలిని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అఘాయిత్యం జరిపారు. దీనిని మొబైల్ ఫోన్లలో వీడియోలు కూడా తీశారు.
ఆ తరువాత నలుగురిలో ఒకనికి మిగితా వారితో గొడవ కావటం, కోపంతో సదరు విద్యార్థి వీడియోలను వైరల్ చేయటంతో జరిగిన దారుణం వెలుగు చూసింది. ఈ క్రమంలో పోలీసులు నలుగురిని అరెస్టు కూడా చేశారు. కొంతమంది యువకులు ఇలాంటి వీడియోల ప్రభావంతో మైనర్బాలురు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఉదంతాలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి.
నోడల్ ఏజన్సీగా సీఐడీ
ఇక, చైల్డ్ పోర్నోగ్రఫీ చెందిన నేరాలను అరికట్టటానికి సీఐడీ నోడల్ ఏజన్సీగా పని చేస్తోంది. అమెరికాలోని ఓ ఏజన్సీ మన దేశంలోని ఏయే ప్రాంతాల నుంచి ఈ తరహా వీడియోలు అప్లోడ్ అవుతున్నాయన్న విషయాన్ని తెలుసుకుంటూ ఆయా రాష్ట్రాల నోడల్ ఏజన్సీలకు సమాచారాన్ని అందిస్తోంది. ఇటీవల వనస్థలిపురంలో నివాసముంటున్న ఓ విద్యార్థి ఇలాగే వీడియోలను అప్లోడ్ చేస్తుండటాన్ని గుర్తించిన సదరు ఏజన్సీ హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ సిబ్బంది ద్వారా సీఐడీకి సమాచారం ఇచ్చింది.
ఈ క్రమంలో సీఐడీ పోలీసులు సదరు యువకున్ని అదుపులోకి కూడా తీసుకున్నారు. దీనిపై సీఐడీకి చెందిన ఓ అధికారితో మాట్లాడగా పోర్న్ వీడియోలు చూసినా, డౌన్ లోడ్, సర్క్యులేట్ చేసినా 2000వ సంవత్సరం ఐటీ యాక్ట్ ప్రకారం నేరమని తెలిపారు. ఈ తరహా నేరాలకు పాల్పడ్డ వారికి అయిదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంటుందని చెప్పారు. చైల్డ్ పోర్నోగ్రఫీ కేసుల్లో ఈ సంవత్సరంలోనే ముప్పయి మందికి పైగా నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు.