- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదుపు తప్పిన స్కూల్ బస్సు.. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది..
దిశ, శామీర్ పేట: స్కూల్ బస్సు అదుపుతప్పి చెట్టుకు ఢీకొని గుంతలోకి దూసుకెళ్లిన ఘటన మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండల పరిధిలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. శామీర్ పేట మండల పరిధి మజీద్ పూర్ గ్రామంలోని శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన బస్సు శామీర్ పేట్ నుంచి తూంకుంట వైపు విద్యార్థులను దింపడం నిమిత్తం బయలుదేరింది. ఈ క్రమంలో దొంగల మైసమ్మ టీ టైం వద్ద బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొని గుంతలోకి దూసుకుపోయింది.
ఈ ప్రమాదంలో కొంతమంది విద్యార్థులకు స్వల్ప గాయాలవడంతో హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది చిన్నారులు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డ్రైవర్ కు లో బీపీ అవడంతో ప్రమాదం జరిగినట్టు పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా డ్రైవర్ మద్యం మత్తులో ఉండి అజాగ్రత్తగా వాహనం నడపడంతోనే ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.