- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజేష్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్.. పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో బయటపడ్డ అసలు నిజం!
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సంచలనం సృష్టించిన హయత్‌నగర్ అనుమానాస్పద మరణం కేసులో మరో కొత్త విషయం వెలుగు చూసింది. ఈ కేసులో మృతుడు రాజేశ్విషం కారణంగానే చనిపోయినట్టుగా పోస్టుమార్టంలో వెల్లడైనట్టు తెలిసింది. అయితే, రాజేశ్తనుకు తానుగానే విషం సేవించాడా? బలవంతంగా అతనితో తాగించారా? అన్నది మిస్టరీగా మారింది.
ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే రాజేశ్మృతదేహం దొరికిన చోట విషానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించకపోవటం. ఏడు నెలల క్రితం వనస్థలిపురం నివాసి సుజాత మొబైల్‌నుంచి రాజేశ్‌కు రాంగ్కాల్వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. సుజాత వాట్సాప్డీపీ చూసిన రాజేశ్ఆమెకు పెళ్లి కాలేదని భావించి వివాహం చేసుకుంటానంటూ ఆమెకు వాట్సాప్మెసెజ్పెట్టినట్టు సమాచారం.
ఆ తరువాత సుజాతకు పెళ్లయిందన్న విషయం తెలిసి రాజేశ్ఆమెను దూరం పెట్టినట్టు తెలిసింది. కాగా, రాజేశ్‌కు పలుమార్లు ఫోన్‌చేసిన సుజాత తనను కలవాలని, లేనిపక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్టు సమాచారం. దాంతో భయపడ్డ రాజేశ్ఈనెల 24న ఆమెను కలవటానికి వచ్చాడు. అయితే, అప్పటికే సుజాత విషం సేవించగా ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయం తెలియని రాజేశ్ఆమె ఇంటికి వెళ్లగా సుజాత కుటుంబసభ్యులు, బంధువులు అతనితో గొడవ పడినట్టు సమాచారం.
అప్పుడే సుజాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన విషయం రాజేశ్‌కు తెలిసింది. ఆ తరువాత వెళ్లిపోయిన రాజేశ్అయిదు రోజుల తరువాత హయత్నగర్స్టేషన్పరిధిలో శవమై కనిపించాడు. సుజాత కుటుంబసభ్యులు, బంధువులతో జరిగిన గొడవ నేపథ్యంలో అంతా ఇది హత్యే అనుకున్నారు. అయితే, మృతదేహానికి జరిపిన పోస్టుమార్టంలో రాజేశ్ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని స్పష్టమైనట్టు తెలిసింది.
విషం కారణంగానే అతను మరణించినట్టుగా తేలిందని సమాచారం. ఈ క్రమంలో సుజాత ఆస్పత్రిలో చనిపోయిన నేపథ్యంలో భయపడ్డ రాజేశ్తనుకు తానుగా విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక అతనితో ఎవరైనా అతనితో బలవంతంగా విషం తాగించారా? అన్నది ప్రస్తుతం మిస్టరీగా మారింది.