శంషాబాద్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ

by Javid Pasha |
శంషాబాద్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ
X

దిశ, వెబ్ డెస్క్: శంషాబాద్ మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. అప్పు తిరిగి ఇవ్వమని అడిగినందుకు మంజులను రిజ్వానా అనే మహిళ హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంజుల కొంతకాలం క్రితం రిజ్వానాకు లక్ష రూపాయలు ఇవ్వగా రిజ్వానా మంజుల ఇంటికి దగ్గరలోనే లేడీస్ ఎంపోరియం నడుపుతుంది. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో కొన్ని రోజుల క్రితం మంజుల మరియు మంజుల భర్త ఇద్దరు కలిసి రిజ్వానా ఇంటికి వెళ్లి రెండు నెలలుగా వడ్డీ కూడా ఇవ్వట్లేదని గొడవ చేశారు. దీంతో మంజులపై కోపాన్ని పెంచుకున్న రిజ్వానా.. ఆమెను చంపాలని పథకం వేసింది.

ఈ క్రమంలోనే రిజ్వానా బేగం పథకం ప్రకారం మంజులతో మాట్లాడుతున్న సందర్భంలో ఆమె కళ్ళలో కారం కొట్టింది. అనంతరం మంజుల చీర కొంగుతోనే మంజుల గొంతుకు ఉరి వేసి హత్య చేసి తర్వాత మంజుల మెడలో ఉన్న బంగారు గొలుసు, కాళ్ళ కడియాలు, చెవి రింగులు లాక్కున్నది. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తుల సహాయంతో పెట్రోల్ తెప్పించి మంజుల మృతదేహాన్ని కాల్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. 24 గంటల వ్యవధిలోనే శంషాబాద్ పోలీసులు ఈ కేసును చేధించారు.

Advertisement

Next Story