- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీడిన హత్య కేసు మిస్టరీ
పోలీసుల అదుపులో నిందితులు
దిశ, కోరుట్ల రూరల్ : మండలంలోని సంగెం గ్రామంలో గురువారం అర్ధారాత్రి జరిగిన హత్య కేసులో నిందుతులను అరెస్ట్ చేసినట్లు కోరుట్ల సీఐ ప్రవీణ్ పేర్కొన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంగెం గ్రామానికి చెందిన వల్లకొండ చిన్నమల్లయ్యను అతడి కుమారుడు వల్లకొండ పవన్ తన మిత్రుడైన మేడిపల్లి మండలం దేశాయిపేటకు చెందిన పొన్నం కార్తీక్ మరో బాలుడితో కలిసి హత్య చేశారని సీఐ వివరించారు. కుటుంబంలో తరచూ గొడవలు సృష్టిస్తున్నాడనే కోపంతో పవన్ తన మిత్రులతో కలిసి చిన్నమల్లయ్యను రోకళ్లతో కొట్టి చంపారని తెలిపారు. ఈ మేరకు మృతుడి సోదరుడు పెద్ద మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి వారిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు సీఐ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని త్వరితగతిన విచారణ చేసి నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కోరుట్ల ఎస్ఐ సతీష్, సిబ్బంది సురేష్, ఎల్లయ్య, సత్తయ్య, కేశవ్, గంగాధర్ లను సీఐ అభినందించారు.