Kidnap: మైనర్‌ను కిడ్నాప్ చేసిన గ్యాంగ్.. రాత్రంతా గదిలో

by Hamsa |   ( Updated:2022-09-09 09:54:34.0  )
Kidnap: మైనర్‌ను కిడ్నాప్ చేసిన గ్యాంగ్.. రాత్రంతా గదిలో
X

దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో అమ్మాయిలపై అత్యాచారాలు చాలా పెరిగిపోయాయి. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలోని సైర్‌పూర్‌లో స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చుదువుతోంది. ఒకరోజు తన పాఠశాల సమీపంలో ఉండగా ఐదుగురు వ్యక్తులు కారులో వచ్చి ఆమెను కిడ్నాప్ చేశారు. ఈ తర్వాత బాలికను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లారు.

రాత్రంతా ఒంటరి గదిలో పెట్టి, ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. అది భరించలేని అమ్మాయి ఉదయం కిటికీలోంచి దూకి తప్పించుకుంది. వెంటనే పోలీసులను కలిసి జరిగిన విషయమంతా చెప్పింది. దీంతో పోలీసులు ఆమెను వైద్య పరీక్షలకు పంపారు. నిందితులపై పలు కేసులు నమోదు చేసి త్వరలో పట్టుకుంటామని తెలిపారు.

Also Read : భార్య హత్య కేసులో భర్తకు జైలు శిక్ష.. చివరకు ఆమె బతికే ఉన్నదని తెలియడంతో


Advertisement

Next Story