ఐదేళ్ల తర్వాత హత్య కేసులో ట్విస్ట్.. యువతి చేసిన పనికి కోర్టు సంచలన తీర్పు

by sudharani |
ఐదేళ్ల తర్వాత హత్య కేసులో ట్విస్ట్.. యువతి చేసిన పనికి కోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో యువత ఎంత దారుణంగా తయారవుతున్నారంటే వారి సంతోషాల కోసం స్నేహితులను హత్య చేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఇలాంటి ఘటనే హరియాణా రాష్ట్రంలో జరిగింది. తన ప్రియుడితో కలిసి ఉండేందుకు స్నేహితురాలినే హత్య చేసింది ఓ యువతి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పానీపత్‌లో నివాసం ఉంటున్న జ్యోతి, కృష్ట అనే వీరిద్దరు కాలేజీలో చదువుకునే రోజుల నుంచి ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమకు జ్యోతి వాళ్ల ఇంట్లో ఒప్పుకోలేదు. దీంతో ప్రేమికులు ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అయితే పెళ్లి ఇష్టం లేని జ్యోతి కుటుంబసభ్యులు తాను ఇంట్లో నుంచి పారిపోయిన మళ్లీ తనని ఇంటికి తీసుకొచ్చేస్తారు అని భావించిన యువతి మాస్టర్ ప్లాన్ వేసింది. తన లాగే ఉండే సిమ్రాన్ అనే స్నేహితురాలని 2017 సెప్టెంబర్ 5న హత్య చేసి తానే చనిపోయినట్లు అందరిని నమ్మించింది.

తర్వాత సిమ్రాన్‌పై మిస్సింగ్ కేసు నమోదు కావడంతో దర్యాప్తులో భాగంగా చనిపోయింది జ్యోతి కాదు సిమ్రాన్ అని పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం 2020లో జ్యోతి, తన ప్రేమికుడు కృష్ణను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కేసు కోర్టు విచారణలో ఉండగా.. క్షయ వ్యాధితో ప్రేమికుడు కృష్ణ జైల్లోనే మరణించాడు. ఇక ఈ ఘటనపై తాజాగా తీర్పు చెప్పిన పానిపత్ కోర్టు.. జ్యోతికి జీవిత ఖైదు విధించింది.

Advertisement

Next Story

Most Viewed