- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగిత్యాలలో క్షుద్ర పూజల కలకలం
by Shiva |
X
మోతే శ్మశాన వాటికలో నగ్నంగా పూజలు
దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లా కేంద్రంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని మోతే శ్మశాన వాటికలో బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి నగ్నంగా సంచరించడంతో పాటు శవాలు కాల్చిన బూడిదను ఒళ్లంతా పూసుకొని ఏవేవో పూజలు చేశాడు. గమనించిన స్థానిక యువత కర్రలతో ఆ వ్యక్తిని వెంబడించగా అక్కడ నుండి పరారైనట్లుగా తెలుస్తుంది.
గుర్తు తెలియని వ్యక్తి శ్మశానంలో నగ్నంగా క్షుద్ర పూజలు చేస్తున్నాడని తెలిసి స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఓ మెస్ ఎదుట కుంకుమ పసుపు నిమ్మకాయలు పెట్టి కోడిని కోసి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు వెలుగు చూశాయి. 15 రోజుల వ్యవధిలో తాంత్రిక పూజలకు సంబంధించి రెండు సంఘటనలు జరగడంతో పట్టణ వాసులు ఆందోళనకు గురవుతున్నారు.
Advertisement
Next Story