- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డెడ్ బాడీని కూడా వదలని దొంగలు..
దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడిలో గల కేర్ ఆసుపత్రిలో సోమవారం హైడ్రామా నడిచింది. నందిపేట్ మండలం దత్తాపూర్ కు చెందిన శకుంతల(48) అనే మహిళ వైద్యం కోసం కేర్ ఆసుపత్రిలో ఈ నెల 21న చేరింది. అప్పటి వరకు ఆమె పరిస్థితి బాగానే ఉన్నా శనివారం మాత్రం క్షీణించింది. ఆదివారం ఉదయం శకుంతల కేర్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ మరణించింది. శకుంతల కుటుంబ సభ్యులు ఆసుపత్రికి సంబంధించిన ఫీజును చెల్లించి ఆమెడెడ్ బాడిని తీసుకెళ్లేందుకు ఆమెఒంటి పై చూడగా రెండున్నర తులాల బంగారు గొలుసు మిస్ అయింది. ఇదే విషయాన్ని ఆసుపత్రి మేనేజ్ మెంట్ కు, డాక్టర్ కు వివరించారు.
సీసీటీవీ పుటేజిని చూసి ఎవరైనా సిబ్బంది తీసారో అని చెబుతామని సముదాయించి పంపించేశారు. ఆదివారం శకుంతల అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబ సభ్యులు సోమవారం కేర్ ఆసుపత్రికి బంగారు గొలుసు కోసం తిరిగి వచ్చారు. అయితే అందులో తన సిబ్బంది ప్రమేయం లేదని సీసీటీవీ పుటేజి చూశామని తెలిపారు. దానితో బాధిత కుటుంబ సభ్యులు స్థానిక 1వ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే అప్పటికప్పుడు యజమాన్యం ఆసుపత్రి వైద్యుడు వారిని రాజీకోసం పిలిచారు. ఆసుపత్రికి వచ్చిన వారికి మళ్ళీ అదే వీడియో పుటేజి చూయించి సంబంధిత నర్సు సైలెన్ ఎక్కించేందుకు మాత్రమే యత్నించిందని గొలుసు తీయలేదని ఈ విషయాన్ని ఇక్కడనే వదిలేయాలని కోరారు. దాంతో బాధితులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఈ విషయం తెలిసిన ఐఎంఏ పెద్దలు జోక్యం చేసుకుని గొడవ సద్దుమనిగేలా యత్నించిన సాధ్యం కాలేదు. చివరకు రెండు వర్గాలు మరోసారి పోలీసులను ఆశ్రయించాయి.