- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లిదండ్రులకు బాలుడి అప్పగింత..
దిశ, రాజేంద్రనగర్: ఆడుకుంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లి బాలుడు తప్పిపోవడంతో తల్లి దండ్రుల ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆరు గంటలలో వెతికి కుటుంబ సభ్యులకు బాలుడిని క్షేమంగా అప్పగించారు. ఈ ఘటన రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మైలార్ దేవుపల్లి పీఎస్ సీఐ మధు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్ కు చెందిన ఇమ్రాన్ తన కుటుంబంతో కలిసి మైలర్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పద్మశాలిపురంలో నివసించే బంధువుల ఇంటికి వచ్చాడు.
ఇమ్రాన్ కొడుకు మహమ్మద్ జీషన్ ఖాన్(4) బయట ఆడుకుంటూ శనివారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికిన జిషన్ ఆచూకీ లభించకపోవడంతో మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన మైలర్ దేవుపల్లి ఇన్ స్పెక్టర్ మధు, ఎస్ఐ రాజశేఖర్ బృందం గాలింపు చర్యలు చేపట్టారు. తప్పిపోయిన బాలుడు జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ కాలనీ వద్ద ఉన్నట్లు సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు గుర్తించి బాలుడిని క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. తప్పిపోయిన తమ కుమారుడిని ఆరు గంటల్లో పోలీసులు తమకు అప్పగించడం పట్ల బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.