లిఫ్ట్ అడిగి వస్తూ అనంతలోకాలకు..

by Sumithra |
లిఫ్ట్ అడిగి వస్తూ అనంతలోకాలకు..
X

దిశ, యాచారం : ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన, శనివారం యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ ఏ.నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కొండ్రెడ్డి యాదయ్య మాల్ గ్రామంలో స్థిరపడ్డారు.

అతని కుమారుడు రామ్ చరణ్ (16) తన తాత వద్దకు వెళ్లడానికి మాల్ నుంచి లిఫ్ట్ అడిగి ద్విచక్ర వాహనం పై వస్తున్నాడు. సరిగ్గా తమ్మలోని గూడా గేటు సమీపంలో కరెంటు జంక్షన్ వద్దకు చేరుకోగానే ఎదురుగా అతి వేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన చింతపట్ల గ్రామానికి చెందిన రవి (35) ని వైద్యం నిమిత్తం స్థానికులు 108 అంబులెన్స్ లో మాల్ లోని లైఫ్ స్టైల్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed