- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్ కేసులో తహసీల్దార్ అరెస్ట్
దిశ, చందుర్తి : ఓ మహిళకు చెందిన ఎకరం భూమిలో నుండి 36 గుంటల భూమిని మరొక వ్యక్తి పేరు మీదకి అక్రమంగా పట్టా చేసిన తహసీల్దార్ నరేష్ ని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. నరేష్ మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన సంటి లస్మవ్వ కు గ్రామ శివారులోని సర్వే నెంబర్ 322/4/1 లో ఎకరం భూమి ఉంది. అందులో గత 40 సంవత్సరాల నుండి సాగులో ఉన్నారు. భూమికి సంబంధించిన గతంలో రైతుబంధు డబ్బులు కూడా వచ్చాయి. తరువాత రైతుబంధు డబ్బులు రాకపోగా లస్మవ్వ కూతురు ప్రమీల అధికారులను సంప్రదించగా ధరణి పోర్టల్ లో 40 గుంటలకు బదులు 6 గుంటల స్థలం మాత్రమే చూపించడంతో చందుర్తి రెవెన్యూ కార్యాలయంలో విచారణ చేశారు.
మిగితా 34 గుంటల వ్యవసాయ భూమిని మల్యాల గ్రామానికి చెందిన గోంటి రాజనర్సు పై అప్పటి తహసీల్దార్ నరేష్ అక్రమంగా 2018-19 లో పట్టా మార్పు చేసినట్లు గుర్తించారు. దీంతో తన తల్లి లస్మవ్వ పేరుపై ఉన్న ఎకరం భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్న గొంటి రాజనర్సు, పట్టా మార్పు చేసిన అప్పటి తహసీల్దార్ నరేష్ తో పాటు అధికారులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని లస్మవ్వ కూతురు సంటి ప్రమీల నవంబర్ 2024న చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే మూడు కేసుల విషయంలో నిందితుడిగా ఉండి సస్పెన్షన్ లో ఉన్న తహసీల్దార్ నరేష్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పట్టా మార్పు చేయించుకున్న గుంటి రాజనర్సు మృతి చెందినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా పట్టా చేసిన గతంలో చందుర్తి మండల తహసీల్దార్ గా పని చేసి రిటైర్డ్ అయిన మరో ఇద్దరిపై రెండు కేసులు, అలాగే నరేష్ పై మూడు కేసులు నమోదు అయినట్టు సీఐ తెలిపారు.