గుట్కా,అంబర్ అమ్మకాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు..

by Aamani |
గుట్కా,అంబర్ అమ్మకాలపై  టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు..
X

దిశ, హనుమకొండ : నిషేధిత పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై ప్రభుత్వం నిషేధించింది.ఈ సందర్భంగా సీపీ ఆదేశాలతో, వరంగల్ కమిషనరేట్ ప్రాంతంలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై టాస్క్‌ ఫోర్స్ సిబ్బంది కమిషనరేట్ అంతటా నిఘా ఉంచి, జనగాం పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్మవాడ ఏరియాలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 8,36,920/- రూపాయల విలువ గల నిషేధిత పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లను తన ఇంట్లో డంప్ చేసి స్థానిక దుకాణాలకు విక్రయించేందుకు కారులో తీసుకు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు.నిందితుడిని స్థానిక జనగామ పోలీసులకు విచారణ నిమిత్తం అప్పగించడం జరిగింది . నిషేధిత పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు కె. శ్రీధర్, సబ్-ఇన్స్పెక్టర్ వి.దిలీప్, టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని సీపీ అభినందించారు.

Next Story