రిజర్వ్ బ్యాంకు ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరి అరెస్ట్

by Javid Pasha |
రిజర్వ్ బ్యాంకు ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరి అరెస్ట్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: రిజర్వ్ బ్యాంకు ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్న ముఠాలోని ఇద్దరు సభ్యులను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సంజీవయ్య ఎలియాస్​ జీవయ్య, ఫిరోజ్​ సులేమాన్, కిరణ్​ లు స్నేహితులు. తేలికగా డబ్బు సంపాదించేందుకు ముగ్గురు కలిసి రిజర్వ్ బ్యాంకులో కొంతమంది అధికారులతో తమకు పరిచయాలు ఉన్నాయని ప్రచారం చేసుకున్నారు. తమకు ఉన్న పరిచయాలతో అటెండర్, క్లర్క్​ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పుకున్నారు. వీరి మాటలు నమ్మిన భార్గవి, శశిరేఖతో పాటు మరో అయిదుగురు తమకు ఉద్యోగాలు ఇప్పించాలని అడిగారు.

ఈ క్రమంలో వీరి నుంచి ఎనిమిది లక్షల రూపాయలు తీసుకున్న నిందితులు నకిలీ నియామక ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని తీసుకుని రిజర్వ్ బ్యాంకుకు వెళ్లగా లబోదిబోమంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు సంజీవయ్య,ఫిరోజ్​ సులేమాన్లను అరెస్టు చేశారు. కిరణ్​ పరారీలో ఉన్నాడు. అరెస్టు చేసిన నిందితులు ఇద్దరిపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం చాదర్ ఘాట్ పోలీసులకు అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed