- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జీవితంపై విరక్తితో యువకుడి ఆత్మహత్య
by Shiva |

X
దిశ, చౌటకూర్ : అనారోగ్యానికి గురైన ఓ యువకుడు తాను మళ్లీ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా అవుతానో లేదో అనే బాధతో జీవితంపై విరక్తి కలిగి ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చౌటకూరు మండల పరిధిలోని కొర్పోలు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఉమ్మడి పుల్కల్ ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కొర్పోల్ గ్రామానికి చెందిన మల్లేశం (27)కు గత ఆరు నెలల నుంచి నరాల బలహీనతతో బాధపడుతున్నాడు.
ఈ క్రమంలో చాలా ఆసుపత్రులు తిరిగినా.. వ్యాధి నయం కాలేదు. దీంతో తాను తిరిగి పరిపూర్ణ ఆరోగ్యవంతుడిని కాలేననే ఆందోళనతో మల్లేశం జీవితంపై విరక్తి కలిగి గ్రామంలోని తన పొలంలోని ఉన్న షెడ్డులో రాడ్డుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ గౌడ్ తెలిపారు.
Next Story