- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జ్యోతిబాపూలే పాఠశాలలో విద్యార్థి మృతి...
దిశ, భైంసా : నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న దిలార్పూర్ మండలం లోలం గ్రామానికి చెందిన ఫయాజ్(14) మంగళవారం మృతి చెందాడు. బాలుడి మృతి అనుమానాస్పదంగా ఉందని కుటుంబీకులు,బంధువులు అంబేద్కర్ విగ్రహం ముందు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు.ఫయాజ్ మృతికి పాఠశాల సిబ్బంది కారణమని ఆరోపిస్తూ, వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై బైఠాయించారు.బాలుడి మృతికి అధికారులు, సిబ్బంది సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.దీంతో జాతీయ రహదారిపై ఇరువైపులా కొద్దిమేర వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఆర్డిఓ రత్న కళ్యాణి సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా,ఆందోళన విరమించారు.
బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని కలెక్టర్ ను కోరిన డీసీసీ అధ్యక్షుడు కుచాడీ శ్రీహరి రావు...
మహాత్మ జ్యోతిబా పూలే పాఠశాలలో మంగళవారం ఉదయం అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థి కి సంతాపం వ్యక్తం చేస్తూ, మృతికి గల పూర్తి వివరాలు సేకరించి,మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా న్యాయం చేయాలని నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ని కోరారు.