- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం..
దిశ, శంషాబాద్ : గుడ్డుచప్పుడు కాకుండా కారులో వచ్చి డ్రగ్స్ అమ్ముతున్న ఓ యువకున్ని ఎస్ఓటీ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ నగర్ వద్ద చోటుచేసుకుంది. పక్కా సమాచారంతో మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి దగ్గర ఉన్న డ్రగ్స్ సీజ్ చేయడంతో పాటు ఓ కారు, రెండు మొబైల్ ఫోన్లు, క్రెడిట్ కార్డులు, 30 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పాత బస్తీకి చెందిన మహ్మద్ హమీద్ అలీగా గుర్తించారు.
నిందితుడిని మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. రాజేంద్రనగర్ పోలీసులు నిందితుడి పై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసునమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. నిందితుడిని పోలీసులు ప్రశ్నించగా పలు కీలకవిషయాలు బయటపెట్టాడు. డ్రగ్స్ ముంబై నుండి హైదరాబాద్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లుగా నిందితుడు తెలిపాడు. నిందితుడు వెనుక ఏదైనా ముఠా ఉందా, లేదా ఒక్కడే తీసుకొచ్చి అమ్ముతున్నాడా, అనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.